రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఎన్‌జీటీ

NGT Dismisses Case Filed By Avulapalli Villagers Over Rayalaseema Lift Irrigation - Sakshi

చిత్తూరు జిల్లా ఆవులపల్లి గ్రామస్థులపై ఎన్‌జీటీ సీరియస్‌

సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చిత్తూరు జిల్లా ఆవులపల్లి గ్రామస్థులు వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. రాయలసీమ లిఫ్ట్‌ అంశంపై అదే పనిగా కేసులు వేయడంపై టిబ్యునల్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై పదేపదే కేసులా అంటూ ఆవులపల్లి గ్రామస్థులపై ఎన్‌జీటీ సీరియస్‌ అయ్యింది. తరచూ కేసులు వేసి ఇబ్బంది పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు మళ్లీ వేస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రిబ్యునల్‌ హెచ్చరించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top