అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై జానీమాస్టర్‌ బంధువు ఫిర్యాదు | New Twist in Jani Master Case | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై జానీమాస్టర్‌ బంధువు ఫిర్యాదు

Oct 12 2024 1:34 PM | Updated on Oct 12 2024 2:01 PM

New Twist in Jani Master Case

నెల్లూరు (క్రైమ్‌): సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. జానీమాస్టర్‌ కేసులో బాధితురాలైన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ తనను లైంగికంగా వేధిస్తోందని ఓ యువకుడు శుక్రవారం నెల్లూరు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సేకరించిన సమాచారం మేరకు.. రంగనాయకులపేటకు చెందిన సమీర్‌ ప్రస్తుతం బిటెక్‌ చదువుతున్నాడు. అతను కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ మేనమామ కుమారుడు. సమీర్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జానీమాస్టర్‌ వద్ద ఉండేవాడు. ఆయనతో పాటు షూటింగ్‌లకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న యువతితో అతనికి పరిచయం అయింది.

 ఆమె 2020 నుంచి తనను తరచూ లైంగిక వేధింపులకు గురిచేసిందని సమీర్‌ ఆరోపించారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సదరు యువతి జానీమాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం, అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉండడం తెలిసిందే. తాజాగా ఆ యువతిపై జానీమాస్టర్‌ మేనమామ కొడుకు ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం మొత్తం తెలంగాణ, చైన్నె రాష్ట్రాల్లో జరగడంతో పోలీసులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement