పోలింగ్‌ @ 70.62 శాతం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ @ 70.62 శాతం

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

నెల్లూరు(పొగతోట): జిల్లాలోని 34 మండలాల్లో గురువారం నిర్వహించిన పరిషత్‌ పోరులో ఓటింగ్‌ 70.62 శాతంగా నమోదైంది. చేజర్ల, కలువాయి, ఉదయగిరి, దగదర్తి, గూడూరు, రాపూరు తదితర మండలాల్లో దొంగ ఓట్లను అధికంగా వేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ఓటర్లు బయటకు రాలేదు. ఫలితంగా కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను లోపలికి రానీయకుండా అధికార పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. కలువాయి మండలం తోపుగుంటలో దొంగ ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్న 23 మందిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గుర్తించారు. వివరాలు అడిగేసరికి నీళ్లు నమలడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అనేక కేంద్రాల్లో సాయంత్రం ఐదు దాటాకా ఓటర్లు క్యూల్లో ఉన్నారు.

ఓటింగ్‌ పర్సంటేజీ ఇలా..

ఉదయం తొమ్మిది గంటలకు 11.02.. 11 గంటలకు 26.20.. మధ్యాహ్నం ఒంటి గంటకు 45.61.. మూడుకు 57.70.. పోలింగ్‌ ముగిసే నాటికి 70.62 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12,85, 840 మంది ఓటర్లకు గానూ 8,53,540 మంది ఓటేశారు. ఎన్నికల నియమావళి మేరకు బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చారు. ప్రత్యేక బందోబస్తు ఆధ్వర్యంలో భద్రపర్చారు. అదే విధంగా నగరంలోని జెడ్పీ కార్యాలయంలో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 11 మంది ఉద్యోగులకు మూడు చొప్పున మండలాలను కేటాయించారు. జెడ్పీ సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య పర్యవేక్షించారు.

మండలాల వారీగా..

ఏఎస్‌పేటలో 69.11.. అల్లూరులో 74.91.. అనంతసాగరంలో 64.56.. ఆత్మకూరులో 71.96.. బోగోలులో 65.09.. బుచ్చిరెడ్డిపాళెంలో 73.69.. చేజర్లలో 70.27.. చిల్లకూరులో 78.35.. దగదర్తిలో 64.87.. దుత్తలూరులో 64.24.. గూడూరులో 83.57.. ఇందుకూరుపేటలో 76.84.. జలదంకిలో 77.64.. కలిగిరిలో 72.53.. కావలిలో 70.58.. కలువాయిలో 75.29.. కొడవలూరులో 69.82.. కొండాపురంలో 71.14.. కోటలో 71.95.. కోవూరులో 63.58.. మనుబోలులో 77.49.. మర్రిపాడులో 63.78.. ముత్తుకూరులో 73.98.. నెల్లూరు రూరల్‌లో 76.39.. పొదలకూరులో 69.72.. రాపూరులో 61.38.. సంగంలో 66.93.. సైదాపురంలో 72.61.. టీపీగూడూరులో 75.41, ఉదయగిరిలో 63.01.. వరికుంటపాడులో 64.38.. వెంకటాచలంలో 75.64.. విడవలూరులో 68.49.. వింజమూరులో 70.15 శాతం పోలింగ్‌ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement