రెచ్చిపోయిన రౌడీలు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన రౌడీలు

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● సమన్వయకర్త ఇంటిపై దాడికి యత్నం

● మంగళపూరులో పోలింగ్‌ బూత్‌ల

స్వాధీనానికి యత్నం

చిల్లకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న పచ్చమూకలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య ఇంటిపై దాడికి యత్నించాయి. తమ కళ్లెదుటే దారుణానికి ఒడిగడుతున్నా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడంతో అధికార పార్టీకి ఎంతమేర సహకారం అందిస్తున్నారనే విషయం స్పష్టమైంది. పోలింగ్‌ బూత్‌లో ఓవైపు ఎన్నికల ప్రకియ నిర్వహిస్తున్న సమయంలో రూరల్‌ ప్రాంతం వారు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అయితే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ పీఏ రాజేష్‌ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతంలోని సుమారు 30 మందిని మంగళపూరు పోలింగ్‌ కేంద్రం వద్దకు గురువారం తరలించారు. వీరంతా కేంద్రానికి చుట్టుపక్కల ఉండి చివరి అరగంటలో ఓట్లు రిగ్గింగ్‌ చేసుకునే ప్రయత్నం చేసేలా చర్యలు చేపట్టారు.

ఇంటిపైకి వెళ్లి..

గ్రామానికి చెందిన సమన్వయకర్త గురవయ్య పలు మండలాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన పచ్చమూకలు ఏకంగా ఆయన ఇంటిపైకి వెళ్లాయి. గేటు బయట సుమారు అరగంట వరకు నిలిచి కేకలు వేయడంతో గురవయ్య కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. సమీపంలో ఉన్న పోలింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి అర గంటలో రిగ్గింగ్‌ చేసేందుకు వీరినంతా సిద్ధం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పచ్చమూకలు రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందనే విషయం తెలుసుకున్న గూడూరు డీఎస్సీ నరసింహమూర్తి అక్కడికి చేరుకుని పోలీస్‌ సిబ్బందితో కలిసి చెదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement