పోలీసులతో తలపడాల్సి వస్తోంది | - | Sakshi
Sakshi News home page

పోలీసులతో తలపడాల్సి వస్తోంది

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

● ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసిన చంద్రబాబు

● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి

పొదలకూరు: టీడీపీతో కాకుండా పోలీసులతో తమ పార్టీ తలపడాల్సి వస్తోందని.. అధికార పార్టీకి ఖాకీలు వత్తాసు పలుకుతూ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని తన స్వగ్రామమైన తోడేరులో కాకాణి.. ఆయన కుమార్తె, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత తమ ఓటు హక్కును గురువారం వినియోగించుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో రాజకీయ అనుభవముందని చెప్పుకొనే చంద్రబాబు.. ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నారని ధ్వ జమెత్తారు. తమ పార్టీ శ్రేణులను పోలీసుల ద్వారా కట్టడి చేస్తున్నారని మండిపడ్డారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లికి చెందిన పోలింగ్‌ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారని ఆరోపించారు. ఎవరో నగదు పంచుతుంటే చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రానికి చెందిన ఏజెంట్ల ఇళ్లకు రాత్రి వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని చెప్పారు. తమ పార్టీకి పట్టున్న పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు పేరుతో జనాలను తరిమేయడం.. టీడీపీకి పట్టున్న కేంద్రాల్లో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో 79 ఎంపీటీసీలు, ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. టీడీపీ అరాచకాలను తమ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొంటున్నారని వివరించారు. తమ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని, దీంతో టీడీపీకి భయం పట్టుకుందన్నారు. ఏదో రకంగా విజయం సాధించే క్రమంలో అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తూ విజయానికి యత్నిస్తోందని మండిపడ్డారు. ఎన్ని అడ్డుంకులొచ్చినా, తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement