తరగని కీర్తి.. తరతరాలకు స్ఫూర్తి

Nawabs And British Rule Gurramkonda Fort in Annamayya District - Sakshi

రాజరికానికి దర్పణం గుర్రంకొండ కోట

అన్నమయ్య జిల్లాకు మణిహారం

నిత్యం పర్యాటకుల సందడి

గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, బ్రిటీషువారి పాలనకు నిలువుటద్దం గుర్రంకొండ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా.. చరిత్రాత్మాక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శాతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది.శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి.

మైసూర్‌ రాజు టిప్పుసూల్తాన్‌ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషువారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘనచరిత్ర కలిగిన ఈకోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు, ఆకట్టుకొనే కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచేకాక కర్ణాటకా నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు.

శత్రుదుర్భేద్యం.. కోటముఖద్వారం
గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. వీటిల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా నీటిలో మొసళ్లును వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించేవారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top