గురి తప్పని ‘గిరి’ నౌకలు | Navy to commission two stealth frigates in Vishakapatnam on August 26 | Sakshi
Sakshi News home page

గురి తప్పని ‘గిరి’ నౌకలు

Aug 12 2025 4:26 AM | Updated on Aug 12 2025 4:26 AM

Navy to commission two stealth frigates in Vishakapatnam on August 26

నేవీ అమ్ములపొదిలోకి రెండు అత్యాధునిక నీలగిరి క్లాస్‌ యుద్ధ నౌకలు  

26న విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో కమిషనింగ్‌ 

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలు 

బ్రహ్మోస్‌ క్షిపణులు, టార్పెడోల ప్రయోగంలో దిట్టలు 

యాంటీ సబ్‌ మెరైన్‌ రాకెట్లు వంటి ఆయుధ సంపత్తి గిరి నౌకల సొంతం

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా మరో రోజు ఆవిష్కృతమవుతోంది. ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన రెండు అత్యాధునిక నౌకలు ఈ నెల 26వ తేదీన నౌకాదళంలో చేరనున్నాయి. ఇండియన్‌ నేవీ చరిత్రలో రెండు వేర్వేరు షిప్‌యార్డుల్లో నిరి్మంచిన ఒకే క్లాస్‌కు చెందిన రెండు యుద్ధ నౌకలను ఆరోజు  ఒకే వేదికపై జాతికి అంకితం చేయనున్నారు.

ప్రాజెక్ట్‌–17లో భాగంగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమైన నీలగిరి క్లాస్‌లో కీలకమైన ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి యుద్ధ నౌకల కమిషనింగ్‌ కార్యక్రమాన్ని 26న తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో నేవల్‌ డాక్‌యార్డులో వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ కీలక ఘట్టానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, భారత నౌకా దళాధిపతి అడ్మిరల్‌ దినేష్ కుమార్‌ త్రిపాఠీ హాజరయ్యే అవకాశం ఉంది. ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌లో ఉదయగిరి, కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌లో హిమగిరి నౌకలను నిరి్మంచారు. ఉదయగిరి.. నేవీ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన 100వ షిప్‌ కావడం మరో విశేషం.  

చైనాకు దీటుగా నౌకా నిర్మాణం
ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో పెరుగుతున్న సముద్ర సవాళ్లను ఎదుర్కొంటున్నందున భారత్‌కు..  ఫ్రంట్‌లైన్‌ స్టీల్‌ ఫ్రిగేట్‌ యుద్ధ నౌకలైన ఉదయగిరి, హిమగిరి వార్‌షిప్‌లు మరింత బలాన్నిస్తాయి. శత్రు దేశాల కవి్వంపు చర్యల్ని సమర్థంగా తిప్పికొడతాయి. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా నౌకా నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానానికి స్వస్తి పలుకుతూ యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు.

ప్రభుత్వ నౌకా నిర్మాణ సంస్థలైన హిందూస్థాన్‌ షిప్‌యార్డ్, మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్, గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌తో పాటు ఎల్‌ అండ్‌ టీ వంటి ప్రైవేట్‌ సంస్థల సహకారంతో అధునాతన నౌకల్ని నిరి్మస్తున్నారు. ప్రపంచ నౌకా నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న చైనా దూకుడుకు భారత్‌ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సగటున 19 నౌకలు తయారు చేస్తుంటే.. భారత్‌ ఏటా 20 యుద్ధ నౌకలు నిరి్మస్తోంది. అయితే.. చైనాలో ఎక్కువగా వాణిజ్య నౌకల నిర్మాణం జరుగుతోంది.

ఐఎన్‌ఎస్‌ హిమగిరి 
తయారైనది: గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ పనులు మొదలైంది: 2018 నవంబర్‌ 10 
తరగతి: నీలగిరి క్లాస్‌ గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగెట్‌ 

బరువు: 6,670 టన్నులు, ఆయుధ సంపత్తితో 7,350 టన్నులు 
పొడవు: 149 మీటర్లు 
వేగం: గంటకు 28 నాటికల్‌ మైళ్లు (52 కి.మీ) 
రేంజ్‌: ఏకధాటిగా 1900 కిమీ ప్రయాణం, 16 – 18 కి.మీ వేగంతో అయితే 10,200 కి.మీ 

సెన్సార్‌: బీఈఎల్‌ రూపొందించిన హంసా ఎన్‌జీ బో సోనార్‌ 
వార్‌ఫేర్‌ సామర్థ్యం: 4 కవచ్‌ సాఫ్‌ లాంచర్స్‌ 
ఆయుధ సంపత్తి: సూపర్‌సోనిక్‌ సర్ఫేస్‌–టు–సర్ఫేస్‌ క్షిపణులు, బరాక్‌–8 యాంటీ ఎయిర్‌ మిసైల్స్, 8 బ్రహ్మోస్‌ యాంటీ షిప్‌ ల్యాండ్‌ ఎటాక్‌ మిసైల్స్, ఒక ల్యాండ్‌ ఎటాక్‌ క్రూయిజ్‌ మిసైల్, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ వరుణాస్త్ర ట్రిపుల్‌ టార్పెడో ట్యూబ్స్‌ 2, యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్‌ లాంచర్లు 2. 
గన్స్‌: ఒక మెలారా 76 ఎంఎం నేవల్‌ గన్, ఏకే–630 గన్స్‌ 2 ఎయిర్‌క్రాఫ్ట్‌: సీకింగ్‌ 42 ఎయిర్‌క్రాఫ్ట్, చేతక్‌ హెలికాప్టర్‌

 

ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి 
తయారైనది: మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ పనులు మొదలైంది: 2020 సెపె్టంబర్‌ 12.. 37 నెలల రికార్డు సమయంలో పూర్తి 
తరగతి: నీలగిరి క్లాస్‌ గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగెట్‌ 
బరువు: 6,670 టన్నులు, ఆయుధ సంపత్తితో 7,350 టన్నులు 

పొడవు: 149 మీటర్లు 
వేగం: గంటకు 28 నాటికల్‌ మైళ్లు(52 కి.మీ) 
రేంజ్‌: ఏకధాటిగా 1,900 కి.మీ ప్రయాణం, 16 – 18 కి.మీ వేగంతో అయితే 10,200 కి.మీ 

సెన్సార్‌: బీఈఎల్‌ రూపొందించిన హంసా ఎన్‌జీ బో సోనార్‌ 
వార్‌ఫేర్‌ సామర్థ్యం: 4 కవచ్‌ సాఫ్‌ లాంచర్స్‌ 
ఆయుధ సంపత్తి: సూపర్‌సోనిక్‌ సర్ఫేస్‌–టు–సర్ఫేస్‌ క్షిపణులు, బరాక్‌–8 యాంటీ ఎయిర్‌ మిసైల్స్, 8 బ్రహ్మోస్‌ యాంటీ షిప్‌ ల్యాండ్‌ ఎటాక్‌ మిసైల్స్, ఒక ల్యాండ్‌ ఎటాక్‌ క్రూయిజ్‌ మిసైల్, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ వరుణాస్త్ర ట్రిపుల్‌ టార్పెడో ట్యూబ్స్‌ 2, యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్‌ లాంచర్లు 2. 

గన్స్‌: ఒక మెలారా 76 ఎంఎం నేవల్‌ గన్, ఏకే–630 గన్స్‌ 2 
ఎయిర్‌క్రాఫ్ట్‌: 2 హాల్‌ ధృవ హెలికాప్టర్లు లేదా సీకింగ్‌ ఎంకే హెలికాప్టర్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement