breaking news
Naval Dockyard in Visakhapatnam
-
గురి తప్పని ‘గిరి’ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా మరో రోజు ఆవిష్కృతమవుతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన రెండు అత్యాధునిక నౌకలు ఈ నెల 26వ తేదీన నౌకాదళంలో చేరనున్నాయి. ఇండియన్ నేవీ చరిత్రలో రెండు వేర్వేరు షిప్‌యార్డుల్లో నిరి్మంచిన ఒకే క్లాస్‌కు చెందిన రెండు యుద్ధ నౌకలను ఆరోజు ఒకే వేదికపై జాతికి అంకితం చేయనున్నారు.ప్రాజెక్ట్–17లో భాగంగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమైన నీలగిరి క్లాస్‌లో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకల కమిషనింగ్ కార్యక్రమాన్ని 26న తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో నేవల్ డాక్‌యార్డులో వైభవంగా నిర్వహించనున్నారు.ఈ కీలక ఘట్టానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, భారత నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠీ హాజరయ్యే అవకాశం ఉంది. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో ఉదయగిరి, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్‌లో హిమగిరి నౌకలను నిరి్మంచారు. ఉదయగిరి.. నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్ కావడం మరో విశేషం. చైనాకు దీటుగా నౌకా నిర్మాణంఇండో–పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సముద్ర సవాళ్లను ఎదుర్కొంటున్నందున భారత్‌కు.. ఫ్రంట్‌లైన్ స్టీల్ ఫ్రిగేట్ యుద్ధ నౌకలైన ఉదయగిరి, హిమగిరి వార్‌షిప్‌లు మరింత బలాన్నిస్తాయి. శత్రు దేశాల కవి్వంపు చర్యల్ని సమర్థంగా తిప్పికొడతాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా నౌకా నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానానికి స్వస్తి పలుకుతూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు.ప్రభుత్వ నౌకా నిర్మాణ సంస్థలైన హిందూస్థాన్ షిప్‌యార్డ్, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, కొచ్చిన్ షిప్‌యార్డ్‌తో పాటు ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో అధునాతన నౌకల్ని నిరి్మస్తున్నారు. ప్రపంచ నౌకా నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న చైనా దూకుడుకు భారత్ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సగటున 19 నౌకలు తయారు చేస్తుంటే.. భారత్ ఏటా 20 యుద్ధ నౌకలు నిరి్మస్తోంది. అయితే.. చైనాలో ఎక్కువగా వాణిజ్య నౌకల నిర్మాణం జరుగుతోంది.ఐఎన్ఎస్ హిమగిరి తయారైనది: గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ పనులు మొదలైంది: 2018 నవంబర్ 10 తరగతి: నీలగిరి క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగెట్ బరువు: 6,670 టన్నులు, ఆయుధ సంపత్తితో 7,350 టన్నులు పొడవు: 149 మీటర్లు వేగం: గంటకు 28 నాటికల్ మైళ్లు (52 కి.మీ) రేంజ్: ఏకధాటిగా 1900 కిమీ ప్రయాణం, 16 – 18 కి.మీ వేగంతో అయితే 10,200 కి.మీ సెన్సార్: బీఈఎల్ రూపొందించిన హంసా ఎన్జీ బో సోనార్ వార్ఫేర్ సామర్థ్యం: 4 కవచ్ సాఫ్ లాంచర్స్ ఆయుధ సంపత్తి: సూపర్సోనిక్ సర్ఫేస్–టు–సర్ఫేస్ క్షిపణులు, బరాక్–8 యాంటీ ఎయిర్ మిసైల్స్, 8 బ్రహ్మోస్ యాంటీ షిప్ ల్యాండ్ ఎటాక్ మిసైల్స్, ఒక ల్యాండ్ ఎటాక్ క్రూయిజ్ మిసైల్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ వరుణాస్త్ర ట్రిపుల్ టార్పెడో ట్యూబ్స్ 2, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు 2. గన్స్: ఒక మెలారా 76 ఎంఎం నేవల్ గన్, ఏకే–630 గన్స్ 2 ఎయిర్‌క్రాఫ్ట్: సీకింగ్ 42 ఎయిర్‌క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్ ఐఎన్ఎస్ ఉదయగిరి తయారైనది: మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ పనులు మొదలైంది: 2020 సెపె్టంబర్ 12.. 37 నెలల రికార్డు సమయంలో పూర్తి తరగతి: నీలగిరి క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగెట్ బరువు: 6,670 టన్నులు, ఆయుధ సంపత్తితో 7,350 టన్నులు పొడవు: 149 మీటర్లు వేగం: గంటకు 28 నాటికల్ మైళ్లు(52 కి.మీ) రేంజ్: ఏకధాటిగా 1,900 కి.మీ ప్రయాణం, 16 – 18 కి.మీ వేగంతో అయితే 10,200 కి.మీ సెన్సార్: బీఈఎల్ రూపొందించిన హంసా ఎన్జీ బో సోనార్ వార్ఫేర్ సామర్థ్యం: 4 కవచ్ సాఫ్ లాంచర్స్ ఆయుధ సంపత్తి: సూపర్సోనిక్ సర్ఫేస్–టు–సర్ఫేస్ క్షిపణులు, బరాక్–8 యాంటీ ఎయిర్ మిసైల్స్, 8 బ్రహ్మోస్ యాంటీ షిప్ ల్యాండ్ ఎటాక్ మిసైల్స్, ఒక ల్యాండ్ ఎటాక్ క్రూయిజ్ మిసైల్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ వరుణాస్త్ర ట్రిపుల్ టార్పెడో ట్యూబ్స్ 2, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు 2. గన్స్: ఒక మెలారా 76 ఎంఎం నేవల్ గన్, ఏకే–630 గన్స్ 2 ఎయిర్‌క్రాఫ్ట్: 2 హాల్ ధృవ హెలికాప్టర్లు లేదా సీకింగ్ ఎంకే హెలికాప్టర్స్ -
అక్రమంగా ప్రవేశిస్తే.. మట్టుపెట్టేలా
సాక్షి, విశాఖపట్నం: శత్రుదేశాల కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా యాంటీ డ్రోన్ సిస్టమ్‌తో పాటు నేవీ ఎయిర్‌ఫీల్డ్‌ను మరింత పక్కాగా నిర్వహించే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శత్రుదేశాల డ్రోన్లను మట్టుపెట్టేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్ఏడీఎస్)ను ఐఎన్ఎస్ డేగాలో సోమవారం తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా ప్రారంభించారు. భారీ డ్రోన్ల నుంచి తూనీగల పరిమాణంలో ఉన్న మైక్రో డ్రోన్ల వరకు దేనినైనా సరే.. లేజర్ ఆధారిత కిల్ మెకానిజం సహాయంతో గుర్తించి వెంటనే మట్టుపెట్టేలా ఈ వ్యవస్థను రూపొందించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సహకారంతో దీనిని తయారు చేశారు. 360 డిగ్రీల కోణంలో.. 10 కిలోమీటర్ల పరిధిలో ఏ డ్రోన్ ఉన్నా.. దాన్ని జూమ్ చేసి.. వివరాలు సేకరించేలా ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు అమర్చారు. రేడియో ఫ్రీక్వెన్సీ, డిటెక్టర్ల సహకారంతో ఆ డ్రోన్లను గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారనే సమాచారాన్ని క్షణాల్లో సేకరిస్తుంది. సమాచారం వచ్చిన వెంటనే శత్రు డ్రోన్ల సిగ్నల్స్‌ను జామ్ చేసి.. దాన్ని నాశనం చేసేలా ఎన్ఏడీఎస్ పనిచేస్తుంది. యుద్ధ నౌకల్లో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం చర్యలు చేపట్టింది. నేవీ ఎయిర్స్టేషన్లకు రక్షణ కవచం పఠాన్‌కోట్ తరహా ఉగ్రదాడులు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను కవచంలా ఏర్పాటు చేసుకోవాలని భారత రక్షణ శాఖ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నేవల్ ఎయిర్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్(ఎన్ఏఐఎస్ఎస్)ను అభివృద్ధి చేశారు. నౌకాదళం ఎయిర్‌స్టేషన్ల పరిధిలోని భద్రతా వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మల్టీ లేయర్ సెక్యూరిటీ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 6 నేవీ ఎయిర్స్టేషన్లలో ఈ ఎన్ఏఐఎస్ఎస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోవాలోని ఐఎన్ఎస్ హన్సా, ముంబైలోని ఐఎన్ఎస్ షిక్రా, అరక్కోణంలోని ఐఎన్ఎస్ రజాలీ, విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, పోర్టుబ్లెయిర్‌లోని ఐఎన్ఎస్ ఉత్క్రోష్, కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడను ఎంపిక చేశారు. సోమవారం విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ఈ కొత్త భద్రతా వ్యవస్థను ప్రారంభించారు. ఈ ఎయిర్‌స్టేషన్‌లో స్మార్ట్ ఫెన్స్‌ను అమర్చారు. దీనిని సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు. ఈ స్మార్ట్ ఫెన్స్ లోపలికి ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్‌తో సహా ఏది ప్రవేశించినా.. వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తుంది. సెకన్ల వ్యవధిలో మొత్తం వ్యవస్థకు సమాచారం అందజేస్తుంది. అనుమతి లేకుండా అక్రమంగా లోపలికి ఎవరు ప్రవేశించాలని భావించినా వారిని మట్టుపెట్టేలా యాంటీ పెనిట్రేషన్, థర్మల్ సెన్సార్లతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పహారా ఏర్పాటు చేశారు. ఎయిర్‌స్టేషన్‌కు దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ వ్యాపింపజేసి.. శత్రువుల చొరబాట్లను సులువుగా పసిగట్టవచ్చు. చదవండి: బస్సంతా మహిళలే.. మరి మా పరిస్థితి ఏంటి..? -
‘రాజ్‌పుత్’కు ఘనంగా వీడ్కోలు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళానికి చెందిన మొదటి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ రాజ్‌పుత్ సేవలు శ్లాఘనీయమని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ (ఏబీ సింగ్) కొనియాడారు. విశాఖ నేవల్ డాక్‌యార్డులో శుక్రవారం సాయంత్రం ఐఎన్ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌక డీ కమిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నౌకాదళానికి అవిశ్రాంత సేవలందించిన రాజ్‌పుత్‌కు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. సూర్యాస్తమయ సమయంలో నౌక నుంచి జాతీయ పతాకాన్ని, నేవల్ ఎన్సైన్, డీ కమిషనింగ్ పెన్నెట్ని నౌకాదళ సిబ్బంది సెల్యూట్ల మధ్య అవనతం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌పుత్ అందించిన సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పోస్టల్ కవర్ని వైస్ అడ్మిరల్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవలందించిన ముఖ్యమైన నౌకల్లో రాజ్‌పుత్ ముందువరసలో ఉంటుందని చెప్పారు. 41 సంవత్సరాల అవిశ్రాంత సేవ 1980 నుంచి 1988 వరకు పశ్చిమ నౌకాదళంలో సేవలందించిన రాజ్‌పుత్.. 1989లో తూర్పు నౌకాదళం అమ్ముల పొదిలో చేరిందని చెప్పారు. క్షిపణి ప్రయోగాలకు ప్రధాన కేంద్రంగా నిలిచిందన్నారు. 41 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నిరాటంక సేవలందించిందని చెప్పారు. 1999 ఒడిశా తుఫాన్ సమయంలోను, 2004 అండమాన్ నికోబార్ దీవుల్లో సునామీ, జకార్తాలో భూకంపం మొదలైన విపత్తుల సమయంలోను రాజ్‌పుత్ అందించిన సహాయక చర్యలు ఎనలేనివన్నారు. మొత్తం 31 మంది కమాండింగ్ అధికారులు నౌకలో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఈ నౌక మొత్తం 7,87,194 నాటికల్ మైళ్లు దూరం ప్రయాణించిందని, ఇది భూమి నుంచి చంద్రునికి మధ్య దూరానికి 3.8 రెట్లని, ప్రపంచవ్యాప్త నేవిగేషన్‌కు 36.5 రెట్లని వివరించారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ డీ కమిషన్ కార్యక్రమాన్ని కొద్దిమంది సమక్షంలో నిర్వహించారు. ఇంటర్నెట్, నావల్ ఇంట్రానెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయగా.. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చైర్మన్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, మాజీ కమాండింగ్ అధికారులు, కమిషనింగ్ క్రూ అధికారులు వీక్షించారు. -
రోబో.. వెర్షన్ 2.5
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ రోగులకు సేవలందించేందుకు సరికొత్త సర్వీస్ రోబో వచ్చేసింది. విశాఖ నేవల్ డాక్ యార్డులోని 200 పడకల కోవిడ్ కేర్ సెంటర్లో మూడు రోజులుగా ప్రయోగాత్మకంగా దీనిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే ముంబయి, గుజరాత్‌లలోని కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ తరహా రోబోలను వినియోగిస్తున్నారు. రోబో అందిస్తున్న సేవలపై సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోబోకు సంబంధించిన వివరాలు మనం అడిగితే.. అది చెబితే ఇదిగో ఇలా ఉంటుంది.. హాయ్ రోబో.. ► హాయ్.. ఐయామ్ నాట్ రోబో.. మై నేమ్ ఈజ్ సోనా, వెర్షన్ 2.5. మేడిన్ ఇండియా. నీ స్పెషల్ ఏంటి సోనా? ► మీరు ఎలా ప్రోగ్రామ్ ఇస్తే అలా మారిపోతుంటాను. మీరు కమాండ్ చేయడమే ఆలస్యం.. ఎంచక్కా చేసేస్తాను. ఎలాంటి పనులు చెయ్యగలవ్? ► మీరు ఏం చెయ్యాలో చెబితే అవన్నీ చేసేస్తాను. మీరు చెయ్యలేని పనులు కూడా నేను చెయ్యగలను. కోవిడ్ పేషెంట్స్ వద్దకు వెళ్లేందుకు మీరంతా కొద్దిగా భయపడుతున్నారు కదా. కానీ నాకు ఎలాంటి భయల్లేవ్. వారికి దగ్గరగా వెళ్లి సేవలందిస్తాను. ప్రస్తుతం ఎక్కడ సేవలందిస్తున్నావ్? ► విశాఖ నేవల్ డాక్ యార్డులో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌కి ప్రయోగాత్మకంగా నన్ను తీసుకొచ్చారు. మూడు రోజులుగా ట్రయల్స్ వేస్తున్నారు. అన్ని పనులూ విజయవంతంగా చేస్తున్నా. ఇక్కడున్న కరోనా బాధితులకు వేళకు ట్యాబ్లెట్లు ఇస్తున్నా.. ఫుడ్ అలెర్ట్ చేస్తున్నా.. వారిని పర్యవేక్షించేందుకు వచ్చే డాక్టర్లకు శానిటైజర్లు అందిస్తున్నా.. ఇంకా ఎన్నో చేస్తున్నా. అవునా.. అయితే నువ్వు రోబోవి కాదు.. కోవిడ్ వారియర్‌వి. ► థాంక్యూ.. ఐ యామ్ సోనా, వెర్షన్ 2.5. -
విశాఖవాసులకు శుభవార్త..!
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటీషిప్ చేసిన వారికి శుభవార్త. నావల్ డాక్‌యార్డ్‌లో గతంలో అప్రెంటీస్లుగా పనిచేసిన వారికి ఉద్యోలిస్తామని రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే హామీ ఇచ్చారు. నావల్ డాక్‌యార్డ్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో కేంద్రాన్ని కోరగా.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. 2017లో ఆదేశాలు జారీ.. విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌కు ఈకేఎం క్లాస్ సబ్మెరైన్ల మరమ్మతు కాంట్రాక్టు అప్పగిస్తూ 2017లో ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి సుభాష్ భామ్రే సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈకేఎం క్లాస్ సబ్మెరైన్ల సంపూర్ణ మరమ్మతుల పని పూర్తి కావడానికి 27 నెలలు పడుతుందని చెప్పారు. మరమ్మతులు పూర్తి చేసుకున్న సబ్మెరైన్లు అదనంగా 5 నుంచి 6 ఏళ్లపాటు సేవలందిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆమోదించడానికి గత జూన్‌లో టెక్నికల్ కమిటీ హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ను సందర్శిందా అన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు టెక్నికల్ కమిటీ సందర్శన అవసరమే లేదని మంత్రి వెల్లడించారు. కాగా, మోటార్ వాహన సవరణ బిల్లుపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రూపంలో మోటార్ వాహన సవరణ బిల్లుకు ఆమెదం తెలపలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లు విషయంలో పార్లమెంటరీ కమిటీ సిఫారసులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. కమిటీ సిఫారసులు ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయన్నారు. -
విశాఖ వాసులకు శుభవార్త..!
-
నిషిద్ధ వస్తువులతో రెలైక్కిన నేవీ ఉద్యోగి
బాంబులుగా అనుమానించి రైళ్లు నిలిపివేత విశాఖ స్టేషన్లో అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రశాంతమైన విశాఖ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి కలకలం రేగింది. మంగళవారం రాత్రి 11.30 నుంచి 1.30 గంటల వరకూ రైల్వే ఉద్యోగులను పరుగులు పెట్టిం చింది. వం దలాది మంది ప్రయాణికులను ఆందోళనకు గు రి చేసింది. ఓ వ్యక్తి వద్ద బాంబులున్నాయంటూ రేగిన కలకలం దావానంలా వ్యాపించి రైల్వే, ఆర్పీఎఫ్, నగరపోలీస్, నేవల్ అధికారుల్లో అల జడి రేపింది. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. 11.30 గంటలకు రైలు బయల్దేరాల్సిన వే ళలో ప్రయాణికులంతా ఒక్క ఉదుటన దిగేశా రు. ఎవరిని అడిగినా బాంబు ఉందట అనే మా టతోనే అంతా పరుగులంకించుకున్నారు. ఓ బోగీ వద్ద ప్లాట్‌ఫారంపై పోలీసులు పెద్ద ఎత్తు న గుమిగూడడంతో అక్కడే బాంబు ఉందంటూ వ దంతులు వ్యాపించాయి. అంతే అంతా పరుగులు.. ఆర్పీఎఫ్ బూటు చప్పళ్లతో విశాఖ రైల్వే స్టేషన్ మార్మోగిపోయింది. మంగళవారం అర్ధరాత్రి విశా ఖ నుంచి ఎల్టీటీ వెళ్లాల్సిన లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్టీటీ) ఎక్స్‌ప్రెస్ వద్ద ఈ సంఘటన జరిగింది. పోలీసు అధికారులంతా సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాంబులున్న వ్యక్తి నేవల్‌లో అధికారిగా నిర్ధారించుకుని ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తీసుకుపోయారు. రైలుకు ప చ్చజెండా ఊపేశారు. ఈ రైలు కోసం మూడు నాలుగు రైళ్లు బయల్దేరకుండా ఆగిపోయాయి. విష యం ఏంటంటే హైదరాబాద్ నేవల్ కెనాల్లో విష్ణుకుమార్ అరియార్ అనే బీహార్ వ్యక్తి అధికారిగా పనిచేస్తున్నా రు. ఇటీవల ఆయన విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో డాగ్‌స్క్వాడ్‌కు శిక్షణిచ్చేందుకు వచ్చారు. తిరిగి లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర యాణమయ్యేందుకు మంగళవారం రాత్రి విశాఖ స్టేషన్‌కు వచ్చారు. అరియార్ ప్రవర్తన, మాటతీరు, భాష కాస్త డిఫరెంట్ గా ఉండడంతో ఆయన బాంబు పెట్టేందుకే వచ్చి ఉంటాడని అంతా కేకలు పెట్టారు. పోలీసుల తనిఖీల్లో కూడా పేలుడు పదార్థాలు, బాంబులను నిర్వీర్యం చేసే కొన్ని పరికరాలు, బాం బులను అమర్చేందుకు ఏర్పాటు చేసే సామగ్రి అంతా ఉండడంతో పోలీసులు కూడా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వాస్తవంగా ఆయన వద్ద ఓ స్నైపర్ డాగ్, రెండు శాంపి ల్స్ ఉన్న పేలుడు పదార్ధాల పెట్టె వుంది. రాత్రంగా ఆయన వద్ద ఉన్న గుర్తింపు కార్డులు చూసి వివరాలు అడిగి తెలుసుకుని నేవల్ పోలీసులతో నిర్ధారించుకున్న తర్వాత ఆయనను విడచిపెట్టారు.