breaking news
Naval Dockyard
-
గురి తప్పని ‘గిరి’ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా మరో రోజు ఆవిష్కృతమవుతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన రెండు అత్యాధునిక నౌకలు ఈ నెల 26వ తేదీన నౌకాదళంలో చేరనున్నాయి. ఇండియన్ నేవీ చరిత్రలో రెండు వేర్వేరు షిప్‌యార్డుల్లో నిరి్మంచిన ఒకే క్లాస్‌కు చెందిన రెండు యుద్ధ నౌకలను ఆరోజు ఒకే వేదికపై జాతికి అంకితం చేయనున్నారు.ప్రాజెక్ట్–17లో భాగంగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమైన నీలగిరి క్లాస్‌లో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకల కమిషనింగ్ కార్యక్రమాన్ని 26న తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో నేవల్ డాక్‌యార్డులో వైభవంగా నిర్వహించనున్నారు.ఈ కీలక ఘట్టానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, భారత నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠీ హాజరయ్యే అవకాశం ఉంది. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో ఉదయగిరి, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్‌లో హిమగిరి నౌకలను నిరి్మంచారు. ఉదయగిరి.. నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్ కావడం మరో విశేషం. చైనాకు దీటుగా నౌకా నిర్మాణంఇండో–పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సముద్ర సవాళ్లను ఎదుర్కొంటున్నందున భారత్‌కు.. ఫ్రంట్‌లైన్ స్టీల్ ఫ్రిగేట్ యుద్ధ నౌకలైన ఉదయగిరి, హిమగిరి వార్‌షిప్‌లు మరింత బలాన్నిస్తాయి. శత్రు దేశాల కవి్వంపు చర్యల్ని సమర్థంగా తిప్పికొడతాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా నౌకా నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానానికి స్వస్తి పలుకుతూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు.ప్రభుత్వ నౌకా నిర్మాణ సంస్థలైన హిందూస్థాన్ షిప్‌యార్డ్, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, కొచ్చిన్ షిప్‌యార్డ్‌తో పాటు ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో అధునాతన నౌకల్ని నిరి్మస్తున్నారు. ప్రపంచ నౌకా నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న చైనా దూకుడుకు భారత్ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సగటున 19 నౌకలు తయారు చేస్తుంటే.. భారత్ ఏటా 20 యుద్ధ నౌకలు నిరి్మస్తోంది. అయితే.. చైనాలో ఎక్కువగా వాణిజ్య నౌకల నిర్మాణం జరుగుతోంది.ఐఎన్ఎస్ హిమగిరి తయారైనది: గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ పనులు మొదలైంది: 2018 నవంబర్ 10 తరగతి: నీలగిరి క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగెట్ బరువు: 6,670 టన్నులు, ఆయుధ సంపత్తితో 7,350 టన్నులు పొడవు: 149 మీటర్లు వేగం: గంటకు 28 నాటికల్ మైళ్లు (52 కి.మీ) రేంజ్: ఏకధాటిగా 1900 కిమీ ప్రయాణం, 16 – 18 కి.మీ వేగంతో అయితే 10,200 కి.మీ సెన్సార్: బీఈఎల్ రూపొందించిన హంసా ఎన్జీ బో సోనార్ వార్ఫేర్ సామర్థ్యం: 4 కవచ్ సాఫ్ లాంచర్స్ ఆయుధ సంపత్తి: సూపర్సోనిక్ సర్ఫేస్–టు–సర్ఫేస్ క్షిపణులు, బరాక్–8 యాంటీ ఎయిర్ మిసైల్స్, 8 బ్రహ్మోస్ యాంటీ షిప్ ల్యాండ్ ఎటాక్ మిసైల్స్, ఒక ల్యాండ్ ఎటాక్ క్రూయిజ్ మిసైల్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ వరుణాస్త్ర ట్రిపుల్ టార్పెడో ట్యూబ్స్ 2, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు 2. గన్స్: ఒక మెలారా 76 ఎంఎం నేవల్ గన్, ఏకే–630 గన్స్ 2 ఎయిర్‌క్రాఫ్ట్: సీకింగ్ 42 ఎయిర్‌క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్ ఐఎన్ఎస్ ఉదయగిరి తయారైనది: మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ పనులు మొదలైంది: 2020 సెపె్టంబర్ 12.. 37 నెలల రికార్డు సమయంలో పూర్తి తరగతి: నీలగిరి క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగెట్ బరువు: 6,670 టన్నులు, ఆయుధ సంపత్తితో 7,350 టన్నులు పొడవు: 149 మీటర్లు వేగం: గంటకు 28 నాటికల్ మైళ్లు(52 కి.మీ) రేంజ్: ఏకధాటిగా 1,900 కి.మీ ప్రయాణం, 16 – 18 కి.మీ వేగంతో అయితే 10,200 కి.మీ సెన్సార్: బీఈఎల్ రూపొందించిన హంసా ఎన్జీ బో సోనార్ వార్ఫేర్ సామర్థ్యం: 4 కవచ్ సాఫ్ లాంచర్స్ ఆయుధ సంపత్తి: సూపర్సోనిక్ సర్ఫేస్–టు–సర్ఫేస్ క్షిపణులు, బరాక్–8 యాంటీ ఎయిర్ మిసైల్స్, 8 బ్రహ్మోస్ యాంటీ షిప్ ల్యాండ్ ఎటాక్ మిసైల్స్, ఒక ల్యాండ్ ఎటాక్ క్రూయిజ్ మిసైల్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ వరుణాస్త్ర ట్రిపుల్ టార్పెడో ట్యూబ్స్ 2, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు 2. గన్స్: ఒక మెలారా 76 ఎంఎం నేవల్ గన్, ఏకే–630 గన్స్ 2 ఎయిర్‌క్రాఫ్ట్: 2 హాల్ ధృవ హెలికాప్టర్లు లేదా సీకింగ్ ఎంకే హెలికాప్టర్స్ -
నేవీ అమ్ములపొదిలోకి వాగీర్.. జలాంతర్గామి విశేషాలివే..
ముంబై: అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఉన్న నూతన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగీర్ లాంఛనంగా భారత నావికాదళంలో చేరింది. సోమవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్ ఇందుకు వేదికైంది. కల్వరీ శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది, ఐదవది అయిన వాగీర్‌ను నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ లాంఛనంగా భారత నేవీలోకి ప్రవేశపెట్టారు. ‘వాగీర్ రాకతో సముద్రజలాల్లో శత్రువుల బారి నుంచి దేశ ప్రయోజనాలను మరింతగా సంరక్షించవచ్చు. ఇంటెలిజెన్స్, నిఘా, మొహరింపు విభాగాల్లో నేవీ సామర్థ్యాన్ని వగర్ పరిపుష్టంచేస్తుంది’ అని ఈ సందర్భంగా భారత నేవీ ప్రకటించింది. ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే ఇసుక షార్క్ చేప(వాగీర్) పేరును దీనికి పెట్టారు. 24 నెలల వ్యవధిలో నేవీ చేరిన మూడో సబ్‌మరైన్ ఇది. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ సంస్థ దీనిని తయారుచేసింది. ఫ్రాన్స్ నుంచి బదిలీచేసిన సాంకేతికతను ఇందులో వినియోగించారు. 11 నెలలపాటు సముద్రంలో పలు రకాల ప్రయోగ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక సోమవారం నేవీలోకి తీసుకున్నారు. జలాంతర్గామి విశేషాలు ► ప్రపంచంలోనే అత్యత్తుమ సెన్సార్లను దీనిలో అమర్చారు. ► వైర్ ఆధారిత టోర్పెడోలున్నాయి. ► దీని ద్వారా సముద్ర అంతర్భాగం నుంచి క్షిపణులను సముద్రజలాల మీది లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు ► స్పెషల్ ఆపరేషన్స్‌లో మెరైన్ కమెండోలను శత్రు స్థావరాలలోకి చడీచప్పుడుకాకుండా తరలించగలదు. ► శక్తివంత డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ► శత్రు టోర్పెడోలను ఏమార్చే నూతన స్వీయ రక్షణ వ్యవస్థతో దీనిని బలోపేతం చేశారు -
ఐఎన్ఎస్ కోల్‌కతా జాతికి అంకితం
ముంబయి : భారత నేవీ అమ్ముల పొదిలో మరో యుద్ధ నౌక చేరింది. ఐఎన్ఎస్ కోల్‌కతాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం జాతికి అంకితం చేశారు. ముంబయిలోని నౌకాస్థావరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నౌకను నేవీకి అప్పగించారు. దేశంలోనే ఇది అతి పెద్ద నౌక. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధనౌక బరువు 7,500 టన్నులు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ భారతదేశాన్ని కాచి కాపాడాతున్నది సైనిక దళాలే అన్నారు. యుద్ధానికి సిద్ధమే కానీ, కయ్యానికి కాలు దువ్వమని ఆయన తెలిపారు. ఇకపై నేవీ సైనిక బలం మరింత పెరిగిందన్నారు. ఐఎన్ఎస్ కోల్‌కతా తయారీతో మన దేశ పరిజ్ఞానాన్ని చాటి చెప్పామని నరేంద్ర మోడీ ప్రశంసించారు. నౌకను తయారు చేసిన శాస్త్రవేత్తలను అభినందించకుండా ఉండలేక పోతున్నానని ఆయన అన్నారు. భారత దేశ రక్షణలోత్రివిధ దళాలు ముఖ్యమైనవని, దేశాన్ని కాపాడుతున్నది సైనిక బలగాలేనని తెలిపారు. సైనికులు దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని, అనుక్షణం సరిహద్దులో కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నారు. వారి సేవలు భారత ప్రజలు మరవలేనివని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో చత్రపతి శివాజి కూడా సముద్ర రక్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎన్ఎస్ కోల్‌కతా చేరికతో ఏ దేశం మనతో సవాల్ చేయలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు పాల్గొన్నారు.