పేదల అభివృద్ధిని చూసి బాబు ఓర్వలేకపోతున్నాడు: నారాయణ స్వామి

Narayana Swamy Slams On Chandrababu Over People Welfare - Sakshi

సాక్షి, తాడేపల్లి: నిరుపేదల కోసం సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. సంక్షేమ పధకాలని నిరుపేదల అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని అన్నారు.

శంకరన్ అనే ఐఎఎస్ కృషితో దేశంలో 20 సూత్రాలు అమలయ్యాయని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, వైఎస్సార్‌లు పేదల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేశారని గుర్తుచేశారు. మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ ఆరోపణలని నారాయణ స్వామి తీవ్రంగా ఖండించారు. ఈ ఇద్దరు ఐఎఎస్‌లు పేదవాళ్లకి ఆగర్బ శత్రువులగా కనపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మాదిరిగా పోలవరం ప్రాజెక్ట్‌ను ఎలా  ఏటిఎంలా ఉపయోగించుకున్నారో చూశామని తెలిపారు.

చంద్రబాబుకి పొరపాటున ఓటేస్తే ఈ సంక్షేమ‌ పధకాలని ఆపేస్తామని స్పష్టం చేసినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అప్పులు చేసినపుడు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్‌లు ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు ప్రజల కోసం ఏ రోజూ తపన పడలేదని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఈ ఇద్దరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా కట్టి చూపించారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో నిర్మాణమైన రోడ్లు వర్షాలకి‌ కొట్టుకుపోవడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబు చేసిన అప్పులు దేనికి ఖర్చు చేశారో ఈ ఇద్దరు అధికారులు చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయగలరా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. పేదల‌కోసం సీఎం వైఎస్ జగన్ ఖర్చు చేస్తే వృధా ఖర్చా? చంద్రబాబు ఎలా ఖర్చు చేసినా మాట్లాడరా? అని నారాయణ స్వామి ధ్వజమెత్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top