‘సచివాలయ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు’ | Nalamaru Chandra Sekhar Reddy Takes On Chandrabau Government | Sakshi
Sakshi News home page

‘సచివాలయ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు’

Feb 7 2025 4:59 PM | Updated on Feb 7 2025 6:59 PM

Nalamaru Chandra Sekhar Reddy Takes On Chandrabau Government

తాడేప‌ల్లి : గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన సచివాలయ వ​్యవస్థను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ినిర్వీర్యం చేశారని ఏపీ ఎన్జీవో ామాజీ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. అదే సమయం వాలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మోసంతో వాలంటీర్లు రోడ్డున పడ్డారని, సంపద సృష్టించటం అంటే ఉద్యోగుల నోళ్లు కొట్టడమేనా? అని ఆయన ప్రశ్నించారు.

‘సంప‌ద అంటే ఉద్యోగుల‌కు రాయితీలు ఇస్తారేమె అనుకొని అందరూ న‌మ్మి ఓట్లు వేశారు.గెలిచిన త‌రువాత ఉద్యోగులతో అవ‌స‌రం లేద‌నేట్టుగా వ్యవహరిస్తున్నారు. జీవో ఎంఎస్ నెంబ‌ర్ 1ని జ‌న‌వ‌రి 25న రిలీజ్ చేశారు.అందులో గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్ద‌లో ప‌ని చేస్తున్న ల‌క్షా 27వేల 175 మందిలో  ల‌క్ష 15వేల వ‌ర‌కు స‌రిపోతారని చెప్పారు. మిగిలిన 15,490మంది స‌ర్ ప్ల‌స్ అని  పేర్కొనడం  దారుణం. స‌చివాల‌యాల్లో ఉద్యోగుల‌ను ఏ,బీ, సీ గ్రేడ్ లుగా విభ‌జించ‌టం ఏంటి?, ఇదంతా ఏదో దురుద్దేశంతో చేస్తున్నార‌నే అనుమానం కులుగుతోంది.

ఎవ్వ‌రితో మాట్లాడ‌కుండా జీవోలు ఎలా‌ ఇస్తారు?, ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఖండిస్తున్నాం.ఉద్యోగుల్లో గంద‌ర‌గోళం సృస్టిస్తున్నారు.ఇన్ని రోజులు ఉద్యోగుల‌కు ఉన్న ఎక్స్ పీరియ‌న్స్ పోతుంది.మాక‌డుపు కొడుతున్నార‌ంటూ ఉద్యోగులంతా బాధ ప‌డుతున్నారు.ఉద్యోగుల‌ను మోసం చేస్తే స‌ర్ణాంధ్ర ఎలా అవుతుంది?,వెంట‌నే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి’ అని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయారు: చంద్రశేఖర్ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement