
సాక్షి, అమరావతి: ఈనెల 20న ఏపీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. ఈమేరకు మంగళవారం పురపాలక శాఖ అదనపు డైరెక్టర్ మురళీకృష్ణ గౌడ్‌కు సమ్మె నోటీసును ఇచ్చినట్టు మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలతోపాటు పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ రంగంలో రాజకీయ జోక్యం అధికమైందని, చాలాచోట్ల కార్మికులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయం చేయాలన్న డిమాండ్లతో సమ్మె చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.