సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ

Mudragada Padmanabham Writes Letter to CM Jagan - Sakshi

సాక్షి, కాకినాడ(కిర్లంపూడి): దళిత నా­య­­కులను దళి­తులే ఎన్నుకొనే అవకాశం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో శుక్రవారం లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు.

ఎవరి ప్రమేయం లేకుండా మెరుగైన పద్ధతు­లలో దళితుల పదవులను దళితులే ఓటు వేసుకునే అవకాశం కల్పించి వారి నాయకు­లను వారే ఎన్నుకొనేలా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. ఇతర వర్గాలు నివసించే వీధుల­లో ఒకటి నుంచి ఐదు దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, దళితులకు సంబంధించిన లక్షలాది రూపాయల గ్రాంట్‌లను అక్కడే ఖర్చు చేయడం వలన ఎక్కువ జనాభా ఉన్న దళితులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

చదవండి: (ఆర్టీసీలో ఆఫర్లు!.. నలుగురు ప్రయాణికులు ఒకేసారి టికెట్‌ తీసుకుంటే..)

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top