హైకోర్టు ఉత్తర్వులు: కేంద్రం జోక్యం చేసుకోవాలి

MP Vijaya Sai Reddy Ask Central To Involve In High Court Issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని విస్మరించి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. తాను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని అసాధారణ  పరిస్థితుల్లో మాత్రమే నిషేధం విధిస్తారని వివరించారు. న్యాయ స్థానాలు మీడియా నోరు నొక్కు తున్నాయని, పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారి వారే  పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. తాజా వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయనఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి పార్లమెంట్‌ వద్ద  గురువారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజాగా విధించిన ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. (హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది)

ప్రధానికి పరిస్థితి వివరిస్తాం    
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వవస్థ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీని, మిగతా కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితి వివరిస్తామని వైఎస్సార్‌సీపీ లోక్ సభ పక్షనేత మిథున్‌ రెడ్డి అన్నారు. ప్రజల అభివృద్ధి పనులుకు కూడా కోర్టులు అడ్డుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో కొంత మంది వల్ల ఈ పరిస్తితి తలెత్తిందని విమర్శించారు. కుంభకోణాలపై దర్యాప్తులు జరుగుతుంటే కోర్టులు అడ్డుపడటం వింతగా ఉందని ఎంపీ మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కుంభకోణాలను వెలికితీయాలని కోర్టులే ఆదేశించాలని అన్నారు. పార్లమెంట్ లోపల తమకు మాట్లాడే అధికారం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top