పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక కోస్తాం: వరుదు కల్యాణి వార్నింగ్‌ | MLC Varudhu Kalyani Serious Warning To TDP And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక కోస్తాం: వరుదు కల్యాణి వార్నింగ్‌

Sep 4 2022 5:00 PM | Updated on Sep 4 2022 5:16 PM

MLC Varudhu Kalyani Serious Warning To TDP And Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం ఏరులై పారింది. లిక్కర్ స్కాం వెనుక భువనేశ్వరీ దేవి పాత్ర ఉందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భువనేశ్వరి.. వేల కోట్లు ఆర్జించారు. మద్యం కంపెనీలన్నీ టీడీపీ వారివే. బ్రాండ్ల పేర్లతో దత్తపుత్రుడు, వియ్యంకుడి రుణం తీర్చుకున్నారు. మద్యం అనుమతుల వెనుక భువనేశ్వరి హస్తం ఉంది. ముడుపుల వాటా కోసమే భువనేశ్వరి, బ్రాహ్మణి మధ్య గొడవలు. భువనేశ్వరి, బ్రాహ్మణి గురించి మాకు అంతా తెలుసు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగారు?. ముడుపుల కోసం ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు. మద్యం ముడుపులపై న్యాయ విచారణ జరగాలి.

ఏపీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 43వేల బెల్టు షాపులను రద్దు చేశారు. పర్మిట్‌ రూమ్‌ల అనుమతి రద్దు చేశారు. మద్యం దుకాణాలను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మంచిపేరు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వైఎస్‌ భారతమ్మ మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భారతమ్మ మీద విమర్శలు చేస్తే తాట తీస్తాం. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే నాలుక కోస్తాం’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: బీ-3 బ్రాండ్లు​ అంటే భువనేశ్వరి, బ్రాహ్మాణి, బాబు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement