
కోలా గురువులు
ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసిన అభ్యర్థి
మత్స్యకార (వాడబలిజ) సామాజిక వర్గానికి చెందిన గురువులు 2009లో రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2012లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పార్టీ తరపున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన్ని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఇప్పుడు శాసనమండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ప్రకటించి మరోసారి మత్స్యకార సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు.
డాక్టర్ కుంభా రవిబాబు
గవర్నర్ కోటాలో సిఫార్సు చేసిన అభ్యర్థి
ఆంధ్రాయూనివర్సిటీలో 1989 నుంచి 2004 వరకు ప్రొఫెసర్‌గా పనిచేసిన కుంభా రవిబాబు.. దివంగత మహానేత వైఎస్సార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లో ప్రవేశించారు. విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం నుంచి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం 2019లో పార్టీ అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్‌గా సేవలందిస్తున్న రవిబాబును ఎమ్మెల్సీ అభ్యరి్థగా ఎంపిక చేశారు.
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులును ఎంపిక చేశారు.
గవర్నర్ కోటాలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్
కుంభా రవిబాబును సిఫార్సు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరికీ కీలక నామినేటెడ్ పదవులను అప్పగించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏకంగా చట్టసభకు ఎంపిక చేసి వారికి మరింత మెరుగైన అవకాశం కలి్పంచారు. ఆవిర్భావం నుంచి పార్టీ ఎదుగుదలకు నిరంతరం కృషి చేసిన కోలా గురువులును ఎమ్మెల్సీ అభ్యరి్థగా ఎంపిక చేయడం పట్ల మత్స్యకార, వాడబలిజ సామాజిక వర్గీయులు హర్షం తెలుపుతున్నారు. అదే విధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రొఫెసర్ కుంభా రవిబాబును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిఫార్సు చేయడంపై గిరిజనులు, మేధావులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్‌కు ధన్యవాదాలు
శాసనమండలిలో బీసీలకు అగ్రపీఠం
మహారాణిపేట: శాసనమండలిలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హర్షం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కలి్పంచారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతటి సాహసమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చరిత్ర తిరగరాశారన్నారు.