టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా

MLA RK Roja Take Charge as Minister of Tourism Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీని గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యాటకశాఖ మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యాటకశాఖ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. 
ఏపీలో టూరిజానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, ఆయన సంస్కరణలతోనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

‘టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. రాష్ట్రంలో అనేక పర్యాటక వనరులున్నాయి.వాటిని గుర్తించి అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతాం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ పాలనను పక్క రాష్ట్రాలలో సైతం ప్రశంసిస్తున్నారు.  రాష్ట్రంలో ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడతాం. టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.’ అని తెలిపారు.


 
రాజకీయ నేపథ్యం: 1999లో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బా«ధ్యతలు నిర్వర్తించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top