‘సీఎం జగన్‌ మీది ఏ పార్టీ.. ఏ మతం అని చూడడు’

MLA Malladi Vishnu Distributes CMRF Cheques At Vijayawada Central - Sakshi

విజయవాడ సెంట్రల్‌లో 50 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సాక్షి, విజయవాడ: నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 50 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు 29,75,000 రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష, సునీత, అనిత, లక్ష్మీ పతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ చూడం మతం చూడం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు సీఎంఆర్ఎఫ్‌పై పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందించాం’’ అని తెలిపారు.

‘‘సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తెచ్చాం. ఆస్పత్రి ఖర్చు1000 రూపాయలు దాటిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్‌లో బకాయిలు లేకుండా చూస్తున్నాం. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం’’ అని మల్లాది విష్ణు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top