
సాక్షి, విజయవాడ: బీసీల్లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 56 బీసీ కార్పొరేషన్‌లతో సీఎం జగన్ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 50 శాతానికిపైగా మహిళలకు పదవులిచ్చి పూలే ఆశయాలు నెరవేర్చారని తెలిపారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించటంతో బీసీల్లో ఆత్మనూన్యతా భావం పోయిందన్నారు. ప్రతి బీసీ ఇంట్లో సీఎం జగన్ ఉంటారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును బీసీలు అసహ్యించుకోవటంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. (చదవండి: ‘టీడీపీ నిర్వాకం వల్లే రోడ్లన్నీ గుంతలు’)