నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: సుచరిత

Minister Sucharitha Visit Varalakshmi House - Sakshi

విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల చెక్‌ అందజేత

సాక్షి, విశాఖపట్నం: ప్రేమోన్మాదానికి బలైన ఇంటర్‌ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి మేకతోటి సుచరిత రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. సోమవారం వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ వరలక్ష్మి ఘటన చాలా బాధాకరమన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు.

‘ఈ హత్యలో నిందితునికి ఇతరులు సహకరించరన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రతి విద్యార్థి దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకునేలా విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నాం. టీనేజ్ వయసులో అమ్మాయిల ప్రవర్తనపైనే కాదు, అబ్బాయిల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే 10 లక్షల సహాయం అందించామ’ని హోంమంత్రి తెలిపారు.


నిందితుడు అఖిల్‌కు మరికొంతమంది సహకరించారని ఆరోపించిన వరలక్ష్మి తల్లిదండ్రులు.. అఖిల్‌కు రౌడీషీటర్లతో సంబంధాలున్నాయని తమకు రక్షణ కల్పించాలని సుచరితను కోరారు. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను సుచరిత ఆదేశించారు. (చదవండి: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్)‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top