ఆ ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దే.. | Minister Pushpa Srivani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

గిరిజనుల కోసం మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

Dec 13 2020 2:55 PM | Updated on Dec 13 2020 3:00 PM

Minister Pushpa Srivani Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: గిరిజనుల కోసం మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేదని  డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను చంద్రబాబు.. ఐదేళ్లు మోసం చేశారని ఆమె దుయ్యబట్టారు. ‘గిరిజనులకు దేశంలో ఎవరూ చేయని మేలు వైఎస్‌ జగన్‌ చేశారు. వారికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీ, 5 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం.గిరిజనులకు ఏనాడైనా చంద్రబాబు ఇన్ని పథకాలు తెచ్చారా?. జీవో నెంబర్ 3పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశామని’’ పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’)

Advertisement
 
Advertisement
Advertisement