వైఎస్సార్‌ ఏపీ వన్‌ గొడుగు కిందకు అన్ని శాఖలు: మంత్రి గౌతమ్‌రెడ్డి

Minister Goutham Reddy Presentation On Industries And Skill Development - Sakshi

నైపుణ్యం వల్లే యువతకు ఉద్యోగాలు

పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలకు వారధి నైపుణ్యశాఖ

పరిశ్రమలు, నైపుణ్య శాఖల సంగమంపై మంత్రి ప్రజెంటేషన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఏపీ వన్‌ గొడుగు కింద అన్ని శాఖలు తీసుకురానున్నట్లు పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.  నైపుణ్యం వల్లే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన సమగ్ర పరిశ్రమ సర్వే, కౌన్సెలింగ్‌, స్కిల్లింగ్‌, ప్లేస్‌మెంట్స్‌, రీస్కిల్లింగ్‌లపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రీస్కిల్లింగ్‌లో భాగంగా శిక్షకులకు శిక్షణ, అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై చర్చించారు. సమగ్ర పరిశ్రమ సర్వే గురించి ఆరా తీశారు.

కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులున్నా సర్వే కొనసాగిస్తున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ బంగారురాజు వెల్లడించారు. 2017లో నైపుణ్య కొరతపై సర్వే జరిగిందని.. సిమెంట్, ఆటోమేటివ్, నిర్మాణ రంగాలు సహా మొత్తం 10 రంగాలపై పరిశీలించిన అనంతరం నైపుణ్య కోర్సులు ఎంపిక చేశామని మంత్రికి ఆయన వివరించారు. తయారీ కోసం భవిష్యత్తులో సాంకేతికతపైనా పరిశీలన చేస్తున్నామని, నైపుణ్యంపై బెంచ్ మార్కు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను సంప్రదించి.. చర్చించామని బంగారు రాజు తెలిపారు.

మంత్రి మేకపాటి అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్ డీఎస్ ఎండీ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Home Guards: ఆంధ్ర వైపు తెలంగాణ హోంగార్డుల చూపు!
AP: ‘మత్స్యకార భరోసా' పథకం.. నేరుగా ఖాతాల్లోకి రూ.10వేలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top