పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి | Marijuana smugglers attack police | Sakshi
Sakshi News home page

పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి

Jun 11 2026 5:09 AM | Updated on Jun 11 2026 5:09 AM

Marijuana smugglers attack police

చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చి పోతున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులపైనే దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. చింతపల్లి మండలంలో గంజాయి స్మగ్లర్లు దాడికి పాల్పడడంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చింతపల్లి మండలం ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు వచ్చి న ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు లోతుగెడ్డ వంతెన సమీపంలో రామారావుపాలెం–మేడూరు జంక్షన్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వçహించారు. 

అదే సమయంలో ఏఓబీ సరిహద్దు ప్రాంతం బలపం కోరుకొండ నుంచి రామారావుపాలెం మీదుగా అటుగా వచ్చి న వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు ఒక్కసారిగా పోలీసుల­పై రాళ్లు రువ్వారు. వాహనాలతో పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో స్మగ్లర్లను నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడడంతో అన్నవరం ఎస్‌ఐ రెండు రౌండ్లు తుపాకీని గాల్లోకి పేల్చారు.

తప్పించుకుని పారిపోతున్న నలుగురిని పట్టుకోగా, మరో నలుగురు పారిపోయారు. వారి నుంచి రూ.కోటి విలువైన 290 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజస్థాన్‌కు చెందిన అర్జున్‌కుమార్, విశాఖపట్నంకు చెందిన ఇమ్రాన్‌ఖాన్, మల్కన్‌జిల్లా(ఒడిశా)కు చెందిన కిసాన్‌కార్, అల్లూరి జిల్లా బలపం గ్రామానికి చెందిన పాంగి శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అన్నవరం పోలీసులు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement