సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను నమ్మిం‍చి.. ఫోన్‌లో ట్విస్ట్‌ ఇచ్చిన బంధువు

Man Cheated Software Employee In Name Of Business In Vijayawada - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని నమ్మించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మోసం చేసిన వ్యక్తిపై గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు... న్యూ గిరిపురానికి చెందిన గుడిసె వెంకటేశ్వరరావు హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వరుసకు అన్నయ్య అయిన మిద్దె వెంకటేష్‌ గవర్నర్‌ పేటలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో షాపు నిర్వహిస్తున్నాడు. తాను కంప్యూటర్‌ స్పేర్‌పార్ట్స్‌ హోల్‌సేల్‌  వ్యాపారం చేస్తున్నానని,  ఆ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొంత పెట్టుబడి కావాలని వెంకటేశ్వరరావును అడిగాడు.

అందుకు అంగీకరించిన వెంకటేశ్వరరావు 2021 నుంచి పలు దఫాలుగా రూ.35లక్షలు వెంకటేష్‌కు ఇచ్చాడు. వెంకటేష్‌ స్కై సీ కంప్యూటర్స్‌ పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్‌ చేశాడు. అనంతరం వెంకటేశ్వరరావు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లాడు.  కొద్ది రోజుల తర్వాత  ఫోన్‌ చేసి వ్యాపారం ఎలా ఉంది?  అని మిద్దె వెంకటేష్‌ను అడగగా  ఇంకా వ్యాపారం ప్రారంభించలేదని సమాధానం ఇచ్చాడు.

అతను గట్గిగా నిలదీయగా  కొత్త కంప్యూటర్‌ సంస్థకు బిజినెస్‌ క్రెడిట్‌ ఇవ్వరని, అందుకే తాను బిజినెస్‌ స్టార్ట్‌ చేయలేదని సమాధానం ఇచ్చాడు.  తర్వాత వెంకటేష్‌ ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న షాపులో వాటా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. గత నెల 27న  నగరానికి వచ్చిన వెంకటేశ్వరరావు షాపునకు వెళ్లి చూడగా, అందులో  రూ.35 లక్షల స్టాకు లేదని గమనించాడు. వెంకటేష్‌ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, తాను మోసపోయానని గ్రహించిన వెంకటేష్‌ను గట్టిగా నిలదీయగా,  వెంకటేష్‌ అతనిని అసభ్య పదజాలంతో దూషించాడు. చంపేస్తానని బెదిరించడమే కాకుండా వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: అసలు విషయం తెలిస్తే షాకే.. సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. యువతి అదృశ్యం కథ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top