షార్‌కు బాంబు బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌ | Man arrested for bomb threat call to Shah | Sakshi
Sakshi News home page

షార్‌కు బాంబు బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌

Jun 19 2025 4:14 AM | Updated on Jun 19 2025 4:14 AM

Man arrested for bomb threat call to Shah

సూళ్లూరుపేట: శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలో తీవ్రవాది ఉన్నాడని చెన్నై కమాండ్‌ కంట్రోల్‌కు ఈనెల 16న అర్ధరాత్రి ఫోన్‌చేసి తప్పుడు సమాచారమిచ్చిన బాలకృష్ణన్‌ విజయ్‌బాబు (43)ను సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, శ్రీహరికోట ఎస్సై శ్రీకాంత్‌ బుధవారం అరెస్ట్‌ చేశారు. 

ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీహరికోట పోలీసులకు షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఫిర్యాదు చేయడంతో ఆరోజునే కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. చెన్నై కమాండ్‌ కంట్రోల్‌కు కాల్‌ చేసిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఈనెల 17న ఫోన్‌ చేసిన వ్యక్తిని సేలంలో గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. బుధవారం ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌ విధించారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement