సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. చింతారెడ్డిపాలెం సర్కిల్ వద్ద ఘటన జరిగింది. వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


