Lata Mangeshkar Death: AP CM YS Jagan Pays Tributes To Legendary Singer - Sakshi
Sakshi News home page

Lata Mangeshkar Death: లతా మంగేష్కర్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్‌

Feb 6 2022 11:10 AM | Updated on Feb 6 2022 5:09 PM

Lata Mangeshkar Passes Away: CM YS Jagan Pays Tribute - Sakshi

సాక్షి, అమరావతి: లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. 'లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి' అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

గవర్నర్‌ సంతాపం
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం తెలియజేశారు. 'తన గాత్రంతో కోట్లాదిమందిని అలరించిన ఇండియన్ నైటింగేల్, భారతరత్న లతా మంగేష్కర్ మృతి సంగీత లోకానికి తీరని లోటు. లతా మంగేష్కర్ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నా' అని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేర్కొన్నారు.

చదవండి: (గాన కోకిల లతా మంగేష్కర్‌ కన్నుమూత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement