అమ్మ పరిస్థితి సీరియస్‌, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి

Kurnool Vishwa Bharati Doctors On YS Avinash Reddy Mothers Health - Sakshi

ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ పరిస్థితి ఆందోళనకరం

కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో లక్ష్మమ్మకు చికిత్స

వారం రోజులు గడువు ఇవ్వాలని సిబిఐని కోరిన అవినాష్

సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి

సాక్షి, కర్నూలు:  దర్యాప్తునకు హాజరు కావాలంటూ సిబిఐ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు ఎంపీ అవినాష్‌ రెడ్డి.

"మా అమ్మ లక్ష్మి (67 ఏళ్లు) తీవ్ర అస్వస్థతకు గురయి, ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. బ్లడ్‌ ప్రెషర్‌తో పాటు హైపర్‌ టెన్షన్‌ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మా నాన్నా భాస్కరరెడ్డి జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న విషయం మీకు తెలిసిందే. మా తల్లితండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఒక్కగానొక్క కొడుకయినా నాపై ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అమ్మకు తోడుగా ఉండి ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. 

వైద్యులు చికిత్స అందిస్తున్నారు కానీ, నిస్సత్తువతో పాటు మగతలో ఉంటున్నారు. ఇప్పటికే ఒకసారి గుండె పోటు వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అమ్మ లక్ష్మికి డాక్టర్లు యాంజియోగ్రామ్‌ టెస్టు చేయగా.. గుండెలో రెండో చోట్ల బ్లాక్‌లు ఉన్నాయని తేలింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆమెను మరిన్ని రోజులు ICUలోనే ఉంచి చికిత్స అందించాలని డాక్టర్లు సూచించారు. 

పై పరిస్థితుల దృష్ట్యా నాకు 7 రోజుల గడువు కావాలని కోరుతున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడగానే మీ ముందు విచారణకు హాజరు కాగలనని అవినాష్‌ రెడ్డి సిబిఐకి ఇచ్చిన లిఖిత పూర్వక జవాబులో పేర్కొన్నారు. 

ఇటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. సుప్రీం కోర్టులో తన పిటిషన్ పై రేపు విచారణ ఉందని సిబిఐకి తెలిపారు అవినాష్ రెడ్డి.  తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి.

మరో వైపు  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఉదయం హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశారు వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు.  

లక్ష్మమ్మ కార్డియో సమస్యతో బాధపడుతున్నారు. బీపీ తక్కువగా ఉండి.. ఏం తినలేకపోతున్నారు. వాంతులు అవుతున్నాయి. మెదడుకు, పొట్టకు అల్ట్రాసౌండ్‌ చేయాల్సి ఉంది. ఆమె ఇంకా వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది.  ఇంకా కొన్నిరోజులు ఆస్పత్రిలోనే ఉండాలి. లో బీపీ కారణంగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాలి అని వైద్యులు ప్రకటించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top