
పోలవరం పనులను పరిశీలిస్తున్న కేఎస్ జవహర్‌రెడ్డి
పోలవరం రూరల్: ప్రభుత్వ లక్ష్యాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. ఈఎన్‌సీ నారాయణరెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ పనిని పరిశీలించి వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల మధ్య జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం, వివిధ దశల్లో చేపట్టి పూర్తి చేసిన పనుల పురోగతిపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. హెడ్ వర్క్స్, స్పిల్‌వే, బ్రిడ్జి, గేట్లు, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్, గ్యాప్–3, ఓటీ రెగ్యులేటర్, బండ్–2, ట్విన్ టన్నెల్స్ తదితర పనులను పరిశీలించారు. పనుల వివరాలను ఎస్‌ఈ కె.నరసింహమూర్తి మ్యాప్ ద్వారా వివరించారు. గురువారం రాత్రి ప్రాజెక్టు ప్రాంతంలోనే జవహర్‌రెడ్డి బస చేశారు.