నడుంలోతు నీళ్లు, అయినా మేం ఎక్కడకీ వెళ్లం!

Krishna Lanka Submerged with Water Due to Heavy Rains  - Sakshi

సాక్షి, విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ ఉగ్రం రూపం దాల్చింది. విపరీతంగా కృష్ణనదిలోకి నీరు చేరడంతో ప్రజలు వణికిపోతున్నారు. వరదనీరు పోటెత్తడంతో జనజీవానం అతలాకుతలం అవుతోంది. అధిక వర్షాల కారణంగా కృష్ణలంక లోతట్టు ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.  భూపేష్ గుప్తా నగర్‌లోకి నడుం లోతు నీరు చేరుకుంది. దీంతో అక్కడ ఉన్నవారిని ముంపు పునరావాస కేంద్రాలకు తరలించాడనికి అధికారులు ప్రత్నిస్తున్నారు.

అయితే దొంగల భయంతో వారు తమ ఇళ్లను విడిచి వచ్చేందుకు ఇష్టం పడటం లేదు.  వీరంతా గట్టుమీద గుడారాలు ఏర్పాటు చేసుకొని తలదాచుకుంటున్నారు. ట్యూబుల సహాయంతో ఇళ్ల నుంచి సామాన్లు తరలిస్తున్నారు.  కరుణించి కాపాడమంటూ కృష్ణమ్మను వేడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. 

చదవండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top