Kodali Nani: కొడాలి నానికి ముందస్తు బెయిల్‌ | Kodali Nani Get Anticipatory Bail In Gudivada Court | Sakshi
Sakshi News home page

Kodali Nani: కొడాలి నానికి ముందస్తు బెయిల్‌

Jun 27 2025 6:06 PM | Updated on Jun 27 2025 7:43 PM

Kodali Nani Get Anticipatory Bail In Gudivada Court

సాక్షి,విజయవాడ:మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్‌ లభించింది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. 

అయితే, ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. కిందికోర్టులో బెయిల్ తీసుకోవాలని కొడాలి నానికి హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల మేరకు కొడాలి నాని శుక్రవారం  గుడివాడ కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. అనంతరం,ముందస్తు బెయిల్ పొందారు. 

	Gudivada Court: కార్యకర్తలతో కొడాలి నాని


 

Advertisement
 
Advertisement
Advertisement