టీడీపీ నాయకుడి ఇంట్లో కర్ణాటక మద్యం.. పరారీలో పచ్చ పార్టీ నేత | Karnataka Liquor Seized In TDP Leader House At Hindupur | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుడి ఇంట్లో కర్ణాటక మద్యం.. పరారీలో పచ్చ పార్టీ నేత

Nov 28 2024 8:50 AM | Updated on Nov 28 2024 1:10 PM

Karnataka Liquor Seized In TDP Leader House At Hindupur

సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీలో పలుచోట్ల మద్యం సిండికేట్ నడుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇక, తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత ఇంట్లో కర్ణాటకకు చెందిన మద్యం బాటిళ్లు దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ అధికారుల దాడుల నేపథ్యంలో సదరు టీడీపీ నేత పరారీ అయ్యాడు.

వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో యథేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. హిందూపురం మండలం కొల్లకుంటలో టీడీపీ నేత ముంజునాథ్ ఏకంగా కర్ణాటకకు చెందిన మద్యాన్ని విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఎక్సైజ్ అధికారులు ముంజునాథ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో కర్ణాటకకు చెందిన దాదాపు 1248 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల దాడుల విషయం తెలుసుకున్న ముంజునాథ్ ఇంట్లో నుంచి పరారీ అయ్యాడు. 

 


 

Advertisement
 
Advertisement
Advertisement