వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్‌మేళా వెబ్‌సైట్‌ ప్రారంభం

Job Fair Website Launch At YSRCP Central Office Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్‌ మేళా వెబ్‌సైట్‌ను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. 

తొలి విడతలో 15 వేల ఉద్యోగాలు: ఎంపీ విజయసాయిరెడ్డి
ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో  కనీసంగా  15 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈనెల 16, 17న తిరుపతి.. 23, 24 తేదీలలో విశాఖపట్నం.. 30 మే 1 న గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ నుంచి పీహెచ్‌డీ వరకు చదివిన వారు అప్లై చేసుకోవచ్చన్నారు. 

లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు: కన్నబాబు
లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. 1.22 లక్షల మందికి సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 2.59 లక్షల మంది వాలంటీర్లను నియమించామని మంత్రి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top