సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.
కాగా, ఈరోజు(బుధవారం, జనవరి 21వ తేదీ) ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జయ ప్రకాశ్, కారుమూరి సునీల్, కార్యకర్తలు హాజరయ్యారు.
ఇదీ చదవండి:


