జేసీ వర్గీయుల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పరామర్శ

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి జేసీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు.
కాగా, తాడిపత్రిలోని మూడో వార్డులో జేసీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇక, గాయపడిన కార్యకర్తలను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.