మే 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు | Intermediate‌ Public‌ Examinations From May 5th In AP | Sakshi
Sakshi News home page

మే 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 2 2021 4:43 AM | Updated on Feb 2 2021 9:24 AM

Intermediate‌ Public‌ Examinations From May 5th In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు 2021 మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతేడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనందున అప్పుడు ఫస్టియర్‌ పరీక్షలు రాసిన వారు ఈ పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. 

మార్చి 31 నుంచి ప్రాక్టికల్స్‌
ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఆదివారాలు సహా ఏప్రిల్‌ 24 వరకు జరుగుతాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో.. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు జరుగుతాయి. 

ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్‌ పేపర్లు
ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వేల్యూస్‌ పరీక్ష మార్చి 24న, ఎన్విరాన్మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement