
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ చేసిన చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు అసెంబ్లీ చేసిన చట్ట సవరణను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదించారు.
గవర్నర్ ఆమోదంతో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి సవరించిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయగా, ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.