విజయవాడలో భారీ అగ్నిప్రమాదం | Huge Fire Broke Out In Chitti Nagar Near Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

Nov 11 2020 6:28 AM | Updated on Nov 11 2020 9:07 AM

Huge Fire Broke Out In Chitti Nagar Near Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ సమీపంలోని చిట్టినగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్క్‌ ప్రాజెక్ట్‌ సమీపాన ఉన్న పాత ప్రసాద్‌ థియేటర్‌లో అర్ధరాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. థియేటర్‌ మూతపడటంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద తీవ్రతకు చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement