పుంగనూరు గిత్తలా.. మజాకా!

Huge Demand For Punganuru Twin Ox - Sakshi

కవల గిత్తలను కొనేందుకు క్యూ 

అమ్మేందుకు ఇష్టపడని యజమాని

మామిడికుదురు: పుంగనూరు జాతికి చెందిన కవల గిత్తలను కొనేందుకు పలు ప్రాంతాల నుంచి రైతులు క్యూ కడుతున్నారు. ఒక్కో గిత్తను రూ.లక్షకు కొనేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడికి చెందిన రైతు అడబాల నాగేశ్వరరావుకు చెందిన దేశవాళీ ఆవు మొదటి ఈతలో పుంగనూరు జాతికి చెందిన కవల గిత్తలకు జన్మనిచ్చింది. అచ్చమైన తెలుపు వర్ణంలో ఉండటంతో వాటికి ఎనలేని డిమాండ్‌ వచ్చింది.

మూడు నెలల వయస్సున్న ఒక్కో కవల కోడె దూడ ధర రూ.లక్ష పలుకుతోంది. ఆ కవల గిత్తలను కొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడకు వస్తున్నారు. చెన్నై, భీమవరం, రాజమహేంద్రవరం, సఖినేటిపల్లి, బెండమూర్లంక తదితర ప్రాంతాల నుంచి రైతులు క్యూ కట్టారు. కానీ వాటిని అమ్మేందుకు రైతు నాగేశ్వరరావు విముఖత చూపుతున్నారు. పుంగనూరు గిత్తల వీర్యానికి మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉన్న నేపథ్యంలోనే వాటిని కొనేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top