కరోనా కట్టడికి భారీగా నియామకాలు | Huge appointments to prevent Corona virus in AP | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడికి భారీగా నియామకాలు

Oct 4 2020 3:55 AM | Updated on Oct 4 2020 3:55 AM

Huge appointments to prevent Corona virus in AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనాను ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు పెద్దఎత్తున వైద్య సిబ్బందితోపాటు ఇతర సేవలకు సంబంధించి అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టింది. కోవిడ్‌–19 సేవల నిమిత్తం స్పెషలిస్ట్‌ డాక్టర్లు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్‌ నర్సులు, శిక్షణ నర్సులు, పారిశుధ్య సిబ్బంది కింద మొత్తం 30,887 మందిని నియమించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఇప్పటికే 20,916 మందికి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఆసుపత్రుల్లో అవసరమైన బెడ్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తూనే మరోవైపు ఈ నియామకాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇవన్నీ రెగ్యులర్‌ నియామకాలకు అదనంగా.. ప్రత్యేకించి కోవిడ్‌–19 కోసం చేపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement