ఓవర్‌ యాక్షన్‌ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు | High Court Serious On Two Police Officers For Defying Court Orders | Sakshi
Sakshi News home page

ఓవర్‌ యాక్షన్‌ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు

Jan 30 2025 10:04 PM | Updated on Jan 30 2025 10:04 PM

High Court Serious On Two Police Officers For Defying Court Orders

సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన ఫలితానికి శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డారు.

సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన ఫలితం.. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డారు. అక్రమ కేసులు పెట్టిన ఇద్దరు ఖాకీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం  చేసింది. ఇద్దరినీ వ్యక్తిగతంగా సంజాయిషీ కోరింది. బోసా రమణ అనే వ్యక్తి విషయంలో పోలీసు అధికారులు.. హైకోర్టు అదేశాలను బేఖాతరు చేశారు. రమణని కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదు.

మరో కేసు ఉందంటూ పోలీసులు ఇచ్చాపురం తీసుకెళ్లారు. తమ ఆదేశాలను ధిక్కరించటంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సీఐలు వెంకటేశ్వర్లు, చెన్నంనాయుడులకు నోటీసులు జారీ చేయాలని రెండు జిల్లాల జిల్లా జడ్జీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీఐలు ప్రభుత్వ లాయర్‌ను వినియోగించుకోకుండా వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement