రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు | Heavy rains in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు

Jun 1 2025 5:41 AM | Updated on Jun 1 2025 9:27 AM

Heavy rains in Andhra Pradesh

మహారాణిపేట (విశాఖ):  నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

వీటి ప్రభావంవల్ల పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక శనివారం విజయనగరం జిల్లా గుర్లలో 8.75 మిల్లీమీటర్లు.. వేపాడ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 7.9 మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 7.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement