గల్ఫ్‌ దేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ దేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి

Published Mon, Sep 4 2023 4:06 AM

Great tribute to YSR in Gulf countries - Sakshi

సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్‌: గల్ఫ్‌ దేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్‌లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కువైట్‌ కన్వినర్‌ ఎం.బాలిరెడ్డి ఆధ్వర్యంలో కువైట్‌లో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దుబాయ్‌ కన్వీనర్‌ సయ్యద్‌ అక్రమ్, ఖతార్‌ కన్వీనర్‌ దొండపాటి శశికిరణ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సా­ర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజలకు సువర్ణ పాలన అందించారని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్సార్‌సీపీని స్థాపించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన కంటే మరో రెండు అడుగులు ముందుకేసి సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో గల్ఫ్‌ కో కన్వినర్‌ గోవిందు నాగరాజు, యూఏఈ అడ్వైజరీ కమిటీ సభ్యులు సోమి­రెడ్డి, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ఎన్‌.మహేశ్రెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఖతా­ర్‌ కో కన్వినర్‌ జాఫర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూజిలాండ్‌లో రక్తదానం, అన్నదానం    
‘నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం, ఎంతైనా సాయం చేసే గుణం డాక్టర్‌ వైఎస్సార్‌ది అని ఏపీ ఎన్‌ఆర్‌టీ సోసైటీ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌ మేడపాటి కొనియాడారు. న్యూజిల్యాండ్‌ దేశం ఆక్లాండ్‌ నగరంలోని వెస్లీ కమ్యూనిటీ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం న్యూజిలాండ్‌ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్‌ వర్ధంతి నిర్వహించారు. జూమ్‌ మీటింగ్‌లో పాల్గొన్న వెంకట్‌ మేడపాటి ప్రసంగిస్తూ విదేశాల్లో ఉన్న ఎంతో మందికి ఎన్నో రకాలుగా వైఎస్సార్‌ సాయం చేశారని గుర్తుచేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నిరుపేదలకు సరస్వతీ కటాక్షం కల్పించి.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉద్యోగాలు చేసుకుని స్థిరపడేలా చేసిన మహా మనిషి వైఎస్సార్‌ అని కొనియాడారు. అనంతరం రక్తదానం, అన్నదానం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం న్యూజిలాండ్‌ కన్వినర్‌ బుజ్జె బాబు, ప్రాంతీయ కోఆర్డినేటర్‌ ఆనంద్‌ యెద్దుల, పార్టీ ప్రతినిధులు సుస్మిత చిన్నమల్రెడ్డి, సుమంత్‌ డేగపూడి, ప్రభాకర్‌ వాసివల్లి, ప్రణవ్‌ అన్నమరాజు, ఆరోన్‌ శామ్యూల్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement