అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి నిశ్చితార్థం  | Gokavaram Younger Woman Engaged with US Younger Man | Sakshi
Sakshi News home page

అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి నిశ్చితార్థం 

Aug 10 2022 7:59 AM | Updated on Aug 10 2022 7:59 AM

Gokavaram Younger Woman Engaged with US Younger Man - Sakshi

నిశ్చితార్థ వేడుకలో అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి

చికాగోకు చెందిన బైరాన్‌ ఆమెను ఇష్టపడ్డాడు. ఇదే విషయాన్ని యువతికి చెప్పగా తన తల్లిదండ్రులకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వారి ప్రేమను అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించడంతో గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని

సాక్షి, గోకవరం (తూర్పుగోదావరి): అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు వారి వివాహానికి గ్రీన్‌ సిగ్నల్‌ చెప్పడంతో నిశ్చితార్థ వేడుకకు గోకవరం మండలం కృష్ణునిపాలెం వేదికయింది. కాకినాడకు చెందిన రాజాలా ఉదయశంకర్, కుసుమ దంపతులు విజయవాడలో స్థిరపడ్డారు. వారి కుమార్తె నివేదిత 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరింది.

ఆమెతో పాటు పనిచేస్తున్న చికాగోకు చెందిన బైరాన్‌ ఆమెను ఇష్టపడ్డాడు. ఇదే విషయాన్ని యువతికి చెప్పగా తన తల్లిదండ్రులకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వారి ప్రేమను అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించడంతో గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని బంధువుల సందడి నడుమ మంగళవారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఈ నెల 11న విజయవాడలో వీరి వివాహం జరగనున్నట్టు వారి బంధువులు తెలిపారు.    

చదవండి: (AP: 7 ప్రభుత్వ స్కూళ్లకు బెస్ట్‌ స్కూల్‌ అవార్డులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement