ప్రేమ జంట బలవన్మరణం | Girl and young man from Kakumanu commit dead | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట బలవన్మరణం

Oct 1 2026 5:18 AM | Updated on Oct 1 2026 5:18 AM

Girl and young man from Kakumanu commit dead

ప్రేమికుల మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన బాలిక, యువకుడు ఆత్మహత్య

మార్టూరు (యద్దనపూడి): ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం కోనంకి చెరువు వద్ద జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి సోదరి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కాకుమానుకి చెందిన లావు విఘ్నేష్‌(19) పదో తరగతి వరకు చదివి నాలుగేళ్లుగా గ్రామంలోనే ఉంటున్నాడు. కాకుమాను మండలం అల్లూరి గ్రామానికి చెందిన బాలిక(16) మండల కేంద్రమైన కాకుమానులో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. గత కొన్ని నెలలుగా వీరు ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలియడంతో సోమవారం కాకుమాను నుంచి ఇంటినుంచి పారిపోయారు. 

ఈ క్రమంలో బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో విఘ్నేష్‌ తన సోదరికి ఫోన్‌చేసి తాము లోకం విడిచి వెళ్లిపోతున్నామని.. నీవే అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా చెప్పాడు. తమ లొకేషన్‌ను సోదరికి పంపి వెంటనే ఇద్దరూ కలిసి చెరువులోకి దూకారు. మృతుడి సోదరి తన బంధువులతో కలిసి కోనంకి చెరువు వద్దకు చేరుకొని స్థానికులను అప్రమత్తం చేసి చెరువులో గాలించారు. అప్పటికే మృతి చెంది నీటి అడుగుకు చేరిన ప్రేమజంట మృతదేహాలను స్థానిక యువకుల సాయంతో బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement