50 వేల పోస్టుల భర్తీకి  ఒకేసారి అనుమతి: సీఎస్‌

Ghanta Chakrapani felicitation By CS Somesh Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేవారమని, ఇప్పుడు అలాకాకుండా అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలో భర్తీకి అనుమతులు ఇస్తామని, ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టామన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చం ద్రావతి, ఖాద్రీల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో గురువారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు.

చక్రపాణి, ఇతర సభ్యులను సీ ఎస్‌ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఘంటా చక్రపాణి అత్యంత పారదర్శకంగా సేవలందిం చారని సీఎస్‌ కొనియాడారు. మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెం చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఘం టా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, నియామకాల భర్తీ ప్రక్రియలో ఉద్యోగులు ఎంతో సహకరించారని, కమిషన్‌ పరపతి అంతర్జాతీ య స్థాయిలో పెరిగిందన్నారు. టీఎస్‌పీఎస్సీలో దరఖాస్తు ప్రక్రియ మొదలు ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, నియామక ఉత్తర్వులు.. ఇలా అన్ని స్థాయిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి సత్ఫలితాలు తెచ్చామన్నారు.

టీఎస్‌పీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) సభ్యుడు డి.కృష్ణారెడ్డి సంస్థ ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి పదవీకాలం గురువారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top