ఊరూరా పండుగలా.. | Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP | Sakshi
Sakshi News home page

ఊరూరా పండుగలా..

Aug 8 2022 4:44 AM | Updated on Aug 8 2022 2:40 PM

Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP - Sakshi

గుంటూరులో యువతికి కరపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే గిరిధర్‌

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తోన్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆదివారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు.

తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే  పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement