కార్డు ధరిస్తే కరోనా రాదట! | Fraud Gang Held For Caronavirus Card Sales in Anantapur | Sakshi
Sakshi News home page

కార్డు ధరిస్తే కరోనా రాదట!

Jul 27 2020 6:37 AM | Updated on Jul 27 2020 11:51 AM

Fraud Gang Held For Caronavirus Card Sales in Anantapur - Sakshi

కరోనా దరి చేరదంటూ విక్రయిస్తున్న కార్డు ఇదే..

గుంతకల్లు: ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని కొంత మంది క్యాష్‌ చేసుకుంటున్నారు. కార్డులు మెడలో ధరిస్తే కరోనా దరి చేరదంటూ నయాదందాకు పాల్పడుతున్నారు పట్టణంలోని ఓ మెడికల్‌ స్టోర్‌ నిర్వాహకులు. ఈ కార్డు ట్యాగ్‌ మెడలో వేసుకుంటే  చుట్టూ ఒక మీటరు వరకు వైరస్‌ సోకదంటూ ప్రచారం చేస్తున్నారు. నెల రోజులపాటు ఇది పని చేస్తుందంటూ ఒక్కోటి రూ. 300లకు విక్రయిస్తున్నారు. మేడ్‌ ఇన్‌ జపాన్‌ ‘‘వైరస్‌ షట్‌ అవుట్‌’’ పేరుతో కార్డులు పట్టణంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ కార్డులో సోడియం క్లోరైడ్, న్యాచురల్‌ జియోలైట్‌ రసాయన మిశ్రమం ఉంటుందని, ఈ కార్డు శరీరానికి వలయంగా రక్షణ ఇవ్వడంతోపాటు ఒక మీటరు దూరంలోనే వైరస్‌ను ఆపేస్తుందని నమ్మిస్తున్నారు. ఈ కార్డు ధరించామన్న ధైర్యంతో చాలా మంది మాస్క్‌లు వేసుకోవడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement