కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత | Sakshi
Sakshi News home page

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత

Published Tue, May 21 2024 3:55 PM

Former Kovvur MLA Pendyala Venkata Krishna Babu Passesd Away

సాక్షి, తూర్పుగోదావది:  తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణ ‌బాబు మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం  అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్‌ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement