
వ్యాధితో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తరలిస్తూ కుయ్ కుయ్ అంటూ వస్తున్న అంబులెన్స్‌కు దారివ్వని చంద్రబాబు
నెల్లూరు: అత్యవసర ఆరోగ్య సేవలకు.. ఆపద సమయంలో చిక్కుకున్న వారిని వెంటనే కాపాడేందుకు ఉపయోగపడే అంబులెన్స్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారి ఇవ్వలేదు. ఆయన రోడ్‌షోలో 108 అంబులెన్స్ చిక్కుకుపోయింది. దీంతో అంబులెన్స్‌లో ఉన్న క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సైరన్ మోగుతున్నా కూడా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదు. దీంతో అంబులెన్స్‌లోని ఓ వ్యాధిగ్రస్తురాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పొదలపూడిలో రోడ్ షో చేపట్టారు. పొదలకూరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఉషారాణి గుండె సంబంధిత నొప్పితో బాధపడుతుండడంతో ఆమెను తీసుకుని అంబులెన్స్ నెల్లూరులోని ఆస్పత్రికి వెళ్తోంది. ఆస్పత్రి మార్గంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంబులెన్స్ ఆ మార్గంలో వెళ్లలేక ఇరుక్కుపోయింది. దారి ఇవ్వమని టెక్నీషియన్ (డ్రైవర్)తో పాటు బాధితురాలి కుటుంబసభ్యులు ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. దీంతో అంబులెన్స్‌లోని మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అతికష్టమ్మీద అక్కడి నుంచి అంబులెన్స్ బయటపడింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అంబులెన్స్‌కు దారివ్వని వ్యక్తి చంద్రబాబు మానవత్వం లేని మనిషి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ‘యముండా’ మాస్క్ లేకుంటే తాటతీస్తా
చదవండి: లాక్‌డౌన్‌పై రేపు ముఖ్యమంత్రి ప్రకటన
చదవండి: లోకేశ్ ఐరన్ లెగ్.. ఎక్కడికెళ్తే అక్కడ మటాశ్